అమ్మ పవార్.. రాష్ట్రపతి కోసమేనా ఇదంతా?
ఉద్దవ్ ఠాక్రేను మహారాష్ట్ర సీఎం అని ప్రకటించిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు రాత్రికిరాత్రే ఏమైందో కానీ ప్లేట్ ఫిరాయించారు. బహిరంగ ప్రకటన ఇచ్చి కనీసం రోజు కూడా మారకముందే తన మనసు, మాట మార్చుకున్నారు. కాంగ్రెస్, శివసేనకు భారీ షాక్ ఇచ్చి అనూహ్యంగా బీజేపీకి మద్దతు ప్రకటించారు పవార్. దీంతో మహా సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఉదయం నిద్ర లేచి టీవీలో వస్తున్న వార్తలు చూసి శివసేన, కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. పవార్‌కు ఏమైంది? ఎందుకు ఇలా ప్లేట్ ఫిరాయించారు? కాంగ్రెస్‌కు సోనియాకు నమ్మిన బంటైన శరద్ పవార్ ఉన్నట్టుండి ఇలా ఎందుకు చేశారు? అనేది మహారాష్ట్రతో పాటు దేశరాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.